వడదెబ్బతో నలుగురి మృతి

వడదెబ్బతో నలుగురి మృతి

 వెలుగు నెట్ వర్క్: వడదెబ్బతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన ఆవుల రాజు(25) ప్రతిరోజు ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లి అనంతరం సమాచార హక్కు చట్టం పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేవాడు. వడదెబ్బకు గురవడంతో రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నాడు. గురువారం సాయంత్రం చికిత్స కోసం కామారెడ్డి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య స్నేహ, కూతురు వినూత్న(3) ఉన్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లికి చెందిన జూపాక శంకర్(48) స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా చేస్తున్నాడు. గురువారం మండుటెండలో పని చేయడంతో వడదెబ్బకు గురై కేంద్రంలోనే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్ గ్రామానికి చెందిన యాట రామమ్మ(95), గంగిపెల్లి నాంపల్లి (90) అనే వృద్ధులు వారం రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో అస్వస్థతకు గురై మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లి పేరుతో యువ‌కుడికి వ‌ల‌.. రూ.65 ల‌క్ష‌లు నొక్కేసి..

ఇవాళ కొండపోచమ్మ సాగర్‌‌‌‌కు నీళ్లు