
మహరాష్ట్ర లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడటంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాల్గర్ జిల్లా త్రయంబకేశ్వర్ దగ్గర జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.