డబూల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం.. నలుగురు అరెస్ట్

 డబూల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం.. నలుగురు అరెస్ట్

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ లోని దివిటిపల్లిలో ఈ ఘటన జరిగింది. సిరాజ్ ఖాద్రి అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు . సిరాజ్ ఖాద్రీ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే అరెస్ట్ అయిన వారిలో అక్షయ్ అనే వ్యక్తి ఉన్నట్ల తెలిపారు.

అక్షయ్ తండ్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నాడన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరినుండి మొత్తం 12లక్షల 50 వేల రూపాయిలు వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. సిరాజ్ ఖాద్రీ నుంచి 2లక్షల 50 వేల రూపాయిల నగదు రికవరీ చేసినట్లు చెబుతున్నారు.