రంగనాయక సాగర్ రిజర్వాయర్‎లో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మిస్సింగ్.. ఒకరు మృతి

రంగనాయక సాగర్ రిజర్వాయర్‎లో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మిస్సింగ్.. ఒకరు మృతి

సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చిన్నకోడూర్ మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‎లో శనివారం (మే 3) నలుగురు గల్లంతయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్‎లో గల్లంతైన వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. ఒక యువతి మృతి చెందింది. యువతి డెడ్ బాడీ లభ్యం అయ్యింది.

ALSO READ | హైదరాబాద్లో విషాదం.. హార్పిక్ తాగిన భార్యాభర్త.. కడుపులో పేగులు కాలిపోయి భార్య మృతి

మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలిని మిరాజ్‎గా గుర్తించారు పోలీసులు. వరంగల్‎కు రెండు కుటుంబాలు హైదరాబాద్‎కు వెళ్తూ మార్గమధ్యలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లో సరదాగా ఈత కొడుదామని ఆగారు. ఈ క్రమంలోనే ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తూ నలుగురు గల్లంతయ్యారు. ఘటన స్థలంలో పోలీసులు సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.