
కామారెడ్డి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. బీడీ వర్కర్స్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు విద్యుత్ షాక్ తో మృత్యువాత పడ్డారు. ఇంట్లో మొదట పిల్లలకు విద్యుత్ వైర్ తగిలి షాక్ కొట్టగా..వారిని కాపాడబోయిన తల్లిదండ్రులు సైతం కరెంట్ షాక్ కు గురయ్యారు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ గా పని చేస్తున్న హైమద్, అతని భార్య పర్వీన్ సహా పిల్లలు అద్నాన్ , మాహిమ్ అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ ఆర్ధిక సాయం ప్రకటించారని మంత్రి వేముల వెల్లడించారు. హృదయవిదారక ఘటన గురించి తెలుసుకున్న సీఎం చలించిపోయారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.