ఆసిఫాబాద్ జిల్లాలో మహిళ అక్రమ రవాణా కేసులో నలుగురికి జైలు

ఆసిఫాబాద్ జిల్లాలో మహిళ అక్రమ రవాణా కేసులో నలుగురికి జైలు
  • శిక్ష పడిన వారిలో కానిస్టేబుల్

తిర్యాణి, వెలుగు: మహిళ అక్రమ రవాణా కేసులో నలుగురికి జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి కుమార్  వివేక్  మంగళవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ నితికా పంత్  తెలిపారు. 2019 జులై ఒకటిన ఆసిఫాబాద్​ జిల్లా తిర్యాణి పోలీస్ స్టేషన్  పరిధిలో ఓ మహిళను గౌరుబాయి, వెంకటి, హరిదాస్(కానిస్టేబుల్) పని ఇప్పిస్తామని నమ్మించి మధ్యప్రదేశ్ కు చెందిన లాలాగిరి గోస్వామికి రూ.1.30 లక్షలకు అమ్మారు. 

గోస్వామి బాధితురాలిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడి, పొలంలో పనులు చేయించుకున్నాడు. అదే నెల 25న బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసింది. అప్పటి ఎస్సై అశోక్​ కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో ముగ్గురు నిందితులకు ఐదేళ్ల జైలు, రూ. 5 వేల చొప్పున జరిమానా, లాలాగిరి గోస్వామికి పదేండ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ చెప్పారు.