
మహబూబ్‌నగర్, వెలుగు: తమకు పెళ్లిళ్లు కావనే మనస్తాపంతో నలుగురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. చర్లపల్లికి చెందిన వెంకటయ్యకు ఆరుగురు కుమార్తెలు. ఐదో కుమార్తె రెండు రోజులుగా కనిపించకుండా పోయింది. ఆచూకీ కోసం వెతుకుతుండగా ఓ వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో మిగతా అక్కాచెల్లెళ్లు ఇక తమకు పెళ్లిళ్లు కావన్న మనస్తాపంతో పురుగులమందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వారిని జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించారు.