అరబిక్ ​స్కూల్​లో కుక్కర్​ పేలి నలుగురు విద్యార్థులకు గాయాలు

అరబిక్ ​స్కూల్​లో కుక్కర్​ పేలి నలుగురు విద్యార్థులకు గాయాలు
  •     వరంగల్ మండిబజార్​లో ఘటన 

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్​ నగరంలోని మండిబజార్​లో ఉన్న అరబిక్ ​స్కూల్​లో శుక్రవారం కుక్కర్ ​పేలడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ​స్కూల్​లో సుమారు 15 మంది విద్యార్థులు అరబిక్​ నేర్చుకుంటున్నారు. వీళ్లంతా చుట్టుపక్కల ఇండ్లల్లోనే ఉంటారు. మధ్యాహ్నం వరకు పాఠశాలలోనే ఉండి ఇండ్లకు వెళ్లిపోతారు. శుక్రవారం టీచర్ పాఠాలు చెప్తూనే అక్కడే ప్రెషర్ ​కుక్కర్​లో అన్నం ​వండుతున్నాడు. దాని పక్కనే విద్యార్థులు కూర్చున్నారు.  కొద్దిసేపటికి కుక్కర్ ​పేలడంతో అబ్దుల్ ​రెహమాన్​(12), సోను(12), షరీఫ్​(12), నౌషద్​(11) గాయపడ్డారు. కుక్కర్​లోని నీళ్లు ఒంటిపై పడడం, ఆవిరికి ఒళ్లు బొబ్బలెక్కాయి. వెంటనే వీరిని వరంగల్​ ఎంజీఎం దవాఖానకు తరలించారు.