ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం

ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్లో  జరిగిన ఎన్ కౌంటర్ లో జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో కానిస్టేబుల్ గాయపడ్డారు. నాగ్రోటాలోని బాన్ టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారు జాము నుంచి  భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య  ఎన్ కౌంటర్ జరిగింది. రెండు వర్గాల మధ్య దాదాపు 4 గంటలు భీకర కాల్పులు జరిగాయి. భద్రతా దళాలు వారి నుంచి మొత్తం 11 ఎకె -47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో జమ్ము, శ్రీనగర్ నేషనల్ హైవేను మూసేశాయి భద్రతా బలగాలు. నగ్రోట, ఉదంపూర్ చెక్ పోస్ట్ ల దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేశాకే అనుమతిస్తున్నారు.

నిన్న పుల్వామాలో  గ్రనేడ్లతో దాడి చేశారు టెర్రరిస్టులు. సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా దాడి జరిగింది. కానీ టార్గెట్ మిస్ అవడంతో 12 మంది స్థానికులు గాయపడ్డారు. సీఆర్పీఎఫ్ కు చెందిన 41వ బెటాలియన్ బంకర్ ను టార్గెట్ గా చేసుకుని టెర్రరిస్టులు దాడి చేశారు. అయితే టార్గెట్ మిస్సయి నిత్యం రద్దీగా ఉండే కాకాపొరా చౌక్ లో గ్రనేడ్ పేలింది. దీంతో స్థానికులు గాయపడ్డారు. వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు.