బ్రెజిల్లో కుంభవృష్టి.. పలువురి మృతి..

బ్రెజిల్లో కుంభవృష్టి.. పలువురి మృతి..

రియో డీ జెనీరో: బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోపై వరణుడి ప్రకోపం కొనసాగుతోంది. గత రెండురోలుగా కుంభవృష్టి కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడంతో 14 మంది మంది చనిపోగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు చెప్పారు. సముద్ర తీర పట్టణమైన కలోనియల్, పారాటీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల ధాటికి ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల్లో కొట్టుకుపోయారని వారి కోసం గాలిస్తున్నారు. వరుణుడి ప్రకోపం ఇలాగే కొనసాగితే మృతువ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇదిలా ఉంటే రియోడీ జెనీరోలో మరో రెండు రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

వరదలపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేశామని, తక్షణమే హెలికాప్టర్లు పంపిస్తున్నట్లు చెప్పారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుంది. 

మరిన్ని వార్తల కోసం..

పంజాబ్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన చెన్నై

ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్‌