ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌ కొత్త పెట్టుబడి రూ.8,800 కోట్లు

ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌ కొత్త పెట్టుబడి రూ.8,800 కోట్లు

బెంగళూరు: యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌‌‌‌‌‌‌‌ ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌ కర్నాటకలో రూ.8,800 కోట్లు  ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. దేవనహళ్లి ఇన్‌‌‌‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ రీజియన్‌‌‌‌ (ఐటీఐఆర్‌‌‌‌‌‌‌‌) లో తన ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్రపోజల్‌‌‌‌కు సంబంధించి చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య నాయకత్వంలోని హై లెవెల్‌‌‌‌ కమిటీ ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌  ఇండస్ట్రియల్‌‌‌‌ ఇంటర్నెట్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఐఐ) ప్రతినిధులతో సమావేశమయ్యిందని రాష్ట్ర  ఇండస్ట్రీస్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ ఎంబీ పాటిల్ పేర్కొన్నారు.  

ALSO READ:నీటి రంగంలో స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు ఎన్నో అవకాశాలు.. కేంద్రమంత్రి షెకావత్​

ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌ సబ్సిడరీ అయిన ఎఫ్‌‌‌‌ఐఐ   రూ.8,800 కోట్లు ఇన్వెస్ట్ చేయనుండగా, సుమారు 14 వేల మందికి ఉద్యోగాలొస్తాయని అంచనా. ఈ ప్లాంట్ కోసం 100 ఎకరాలు అవసరమని పాటిల్ వెల్లడించారు. ల్యాండ్‌‌‌‌ను త్వరలో అందిస్తామని,  కొన్ని సమస్యలు ఉండగా తానే స్వయంగా నాలుగు సార్లు మీటింగ్స్ నిర్వహించానని పేర్కొన్నారు.