హైదరాబాద్​లో ఫ్రాక్​ స్పేస్​ సేవలు

హైదరాబాద్​లో ఫ్రాక్​ స్పేస్​ సేవలు

హైదరాబాద్, వెలుగు : ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ స్టార్టప్ ఫ్రాక్‌‌ స్పేస్ హైదరాబాద్​లో తన సేవలను మొదలుపెట్టింది. హైదరాబాద్‌‌లోని టీ–హబ్​లో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రైవేట్, డొమెస్టిక్ రియల్ ఎస్టేట్‌‌లో ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్‌‌మెంట్, యాజమాన్యం పద్ధతి ఇండ్లను కొనేందుకు ఈ స్టార్టప్ కంపెనీ సాయపడుతుంది. అంటే పరిమిత పెట్టుబడి ద్వారా ఆస్తికి యజమానిగా మారవచ్చు.

భారతదేశంలో ఎక్కడైనా హాలిడే హోమ్​, కమర్షియల్​ ప్రాపర్టీల వంటి విభిన్నమైన ఆస్తుల పోర్ట్‌‌ఫోలియోలో ఇన్వెస్ట్​ చేయడానికి ఫ్రాక్​స్పేస్​ సాయపడుతుంది. ప్రాపర్టీని తిరిగి అమ్మడానికి కూడా సహకారం అందిస్తుంది. ప్రతి ఫ్రాక్- యజమాని తన ఆస్తిని కిరాయికి కూడా ఇచ్చుకోవచ్చని, మంచి ధర ఉన్నప్పుడు ఎగ్జిట్​ కావొచ్చని ఫ్రాక్​స్పేస్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ఉన్నత్​ రెడ్డి చెప్పారు.