ఎంపీ డీ శ్రీనివాస్  భుజానికి ఫ్రాక్చర్

V6 Velugu Posted on Sep 27, 2021

హైదరాబాద్: ఎంపీ డీ శ్రీనివాస్  భుజానికి ఫ్రాక్చర్ అయ్యింది. సోమవారం ఉదయం పూజ చేసుకొని పూజ గదిలో నుండి బయటికొస్తుండగా జారి కింద పడిపోవడంతో చేతికి గాయమైంది. ఈ విషయాన్ని డీఎస్ కొడుకు ఎంపి ధర్మపురి ఆర్వింద్ తెలిపారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందన్నాడు. కానీ భుజానికి ఫ్రాక్చర్ అయ్యిందని.. మరో నాలుగు రోజుల్లో చిన్న సర్జరీ చేస్తామని డాక్టర్లు తెలిపారన్నారు.  
హాస్పిటల్ లో MRI, X-Ray లు చేయించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చామన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ తండ్రితో ఉన్న ఓ ఫొటోను షేర్ షేర్ చేశారు ఎంపి ధర్మపురి ఆర్వింద్. 

Tagged Bjp, dharmapuri arvind, fracture, , MP D Srinivas

Latest Videos

Subscribe Now

More News