మే 11 వరకు లాక్ డౌన్ …జులై 15 దాకా నో పబ్లిక్ ఈవెంట్స్

మే 11 వరకు లాక్ డౌన్ …జులై 15 దాకా నో పబ్లిక్ ఈవెంట్స్

ఫ్రాన్స్ : కరోనా వ్యాప్తి అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడగించింది. మే 11 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను కొనసాగించాలని నిర్ణయించింది. ఆ తర్వాత దశల వారీగా స్కూల్స్, బిజినెస్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపింది. జనం గుమిగూడకుండా జులై 15 వరకు కూడా చర్యలు చేపడతామంది. అప్పటి వరకు పబ్లిక్ ఈవెంట్స్ కు పర్మిషన్ ఇచ్చేది లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ చెప్పారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా నివారణకు లాక్ డౌన్ కొనసాగించటం తప్ప వేరే మార్గం లేదన్నారు. ” మే 11 తర్వాత కొత్త దశ ప్రారంభమవుతుంది. కరోనా అప్పటి వరకు తగ్గుతుందని భావిస్తున్నాం ” అని ఆయన చెప్పారు. కరోనా కేసులను బట్టి లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేస్తామన్నారు. కరోనా ఎఫెక్ట్ అధికంగా టాప్ ఫైవ్ కంట్రీస్ లో ఫ్రాన్స్ కూడా ఉంది. దాదాపు లక్షా 30 వేల మంది కరోనా బారిన పడగా 15 వేల మంది వరకు చనిపోయారు. సోమవారం ఒక్కరోజే ఫ్రాన్స్ లో 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా నివారణకు మరింత గట్టి చర్యలు తీసుకోవటంలో భాగంగా లాక్ డౌన్ ను కంటిన్యూ చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయటం సరికాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని దేశాలకు సూచించింది. అదే జరిగితే మళ్లీ సమస్య మొదటికొస్తుందని ప్రకటించింది.