విదేశాల్లో ఉద్యోగాల పేరిట లక్షల్లో మోసం.. డబ్బు తిరిగి అడిగే సరికి..

విదేశాల్లో ఉద్యోగాల పేరిట లక్షల్లో మోసం.. డబ్బు తిరిగి అడిగే సరికి..

విదేశాల్లో ఉద్యోగాల పేరిట లక్షల్లో డబ్బులు దండుకొని బోర్డును తిప్పేసిన కన్సల్టెన్సీ ఆఫీస్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లక్డికాపూల్ లోని రియన్ వీసా & ఇమ్మిగ్రేషన్స్ కన్సల్టెన్సీ ఫెక్సీలను చింపేసి నిరసన వ్యక్తం చేశారు. 

యూకే, కెనడా, మాల్టా దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ ఎండి మదాసు కుమార్ నమ్మించారని బాధితులు ఆరోపించారు. జాబ్ పర్మిట్ వీసా, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరి నుండి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేశారని వాపోయారు. తమను నమ్మించేందుకు ఫెక్ ఆఫర్ లేటర్లను ఇచ్చి మభ్యపెట్టారని... డబ్బులు కట్టిన 45 రోజుల్లో విదేశాలకు పంపిస్తానని చెప్పినట్లు వివరించారు.

Also Read :- పైనాపిల్తో మోమోస్..హే భగవాన్..

అయితే నెలలు గడుస్తున్నా ఏదో ఒక సాకు చెబుతూ గడువు దాటవేశాడని... గట్టిగా నిలదీయడంతో కార్యాలయానికి తాళాలు వేసి తప్పించుకొని తిరుగుతున్నాడని ఆదోళన వ్యక్తం చేశారు. సుమారు వంద మందిని ఇలాగే మోసం చేశాడని... ఎండి మదాసు కుమార్ పై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.