జీడిమెట్ల, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకుల నుంచి డబ్బులు వసూళ్లు చేసిన వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కానిపాక చంద్రశేఖర్... అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని జీడిమెట్లకు చెందిన ఇంద్రజిత్గిరి నుంచి రూ.3 లక్షలు వసూళ్లుచేశాడు. అనంతరం ఉద్యోగం వచ్చిందని అతడికి అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ, ఐడీ కార్డు ఇచ్చాడు.
చంద్రశేఖర్ ఇచ్చిన అపాయింట్మెంట్ఆర్డర్, ఐడీ కార్డు ఫేక్ అని తేలడంతో అతడుఆవాక్కయ్యాడు. దీంతో బాధితుడు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, చంద్రశేఖర్ ఏకంగా ఫేక్కరెన్సీ ఇచ్చాడు. మళ్లీ మోసపోయామని గ్రహించిన బాధితుడు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు 30 మంది నుంచి మొత్తం రూ.25 లక్షల వరకు చంద్రశేఖర్ వసూళ్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి ఫేక్ అపాయింట్ మెంట్లెటర్స్, ఐడీ కార్డులు, కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
