ఎమ్మెల్సీ కవిత నోరు అదుపులో పెట్టుకోవాలి : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

 ఎమ్మెల్సీ కవిత నోరు అదుపులో పెట్టుకోవాలి : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

కురవి, వెలుగు: ఎమ్మెల్సీ కవిత నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం కురవి వీరభద్రస్వామిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ కూతురుగా ఎమ్మెల్సీ కవితకు గౌరవం ఇస్తున్నామని, పార్టీపై, బీఆర్​ఎస్​ నాయకులపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

 జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన అత్యుత్సాహం ప్రదర్శించవద్దని, రాబోయే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో నరహరి గౌడ్, బాదె నాగన్న, బోడ శీను, నెహ్రూ నాయక్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలో సీపీఐ మండల కార్యదర్శి కర్ణం రాజన్న అనారోగ్యానికి గురి కావడంతో మాజీ మంత్రి ఆయనను పరామర్శించారు.