మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం  : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

జయశంకర్​ భూపాలపల్లి/ మొగుళ్లపల్లి, వెలుగు: రానున్న మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం ఖాయమని, బీఆర్ఎస్​కు గుండు సున్నా తప్పదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పల్లె దవాఖాన, మేడారం బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి డిపో నుంచి మొత్తం 80 సర్వీసులు జాతరకు నడుపుతున్నట్లు తెలిపారు. నాలుగు పాయింట్లు భూపాలపల్లి నుంచి 40 బస్సులు, సిరోంచ నుంచి 20 బస్సులు, కాటారం నుంచి 10  బస్సులు, కాళేశ్వరం నుంచి 10 బస్సు సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొగుళ్లపల్లి మండలంలోని 26 గ్రామాలకు చెందిన 32 మందికి క్యాంప్​ ఆఫీస్​లో ఎమ్మెల్యే సత్యనారాయణరావు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులను అందజేశారు. అంతకుముందు వేములపల్లి గ్రామంలో మసీదును ఆయన సందర్శించారు. కాగా, ఎమ్మెల్యేను గ్రామ సర్పంచ్​ అరెల్లి రమేశ్​గౌడ్​సన్మానించారు.