కాశీబుగ్గ/ జనగామ అర్బన్, వెలుగు: మేడారం మహా జాతరను పురస్కరించుకొని ఆదివారం వరంగల్ సిటీలోని వరంగల్ బస్ స్టేషన్ లోని తాత్కాలిక బస్ పాయింట్ ను, ప్రత్యేక బస్సులను హనుమకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్, ఇంతేజార్గంజ్ సీఐ ఎంఏ షుఖూర్తో కలిసి ప్రారంభించారు.
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ గ్రౌండ్స్ నుంచి మేడారం మహాజాతరకు ప్రత్యేక బస్సులను అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆర్టీసీ డిపో మేనేజర్ స్వాతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
