వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం సందీప్ మెడికల్ ఏజెన్సీస్ అండ్ క్లినిక్ నిర్వాహకుడు, సందీప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కోటపల్లి సందీప్ ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత అంబులెన్స్‌ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
సందీప్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో వికారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కేవలం ఇంధన చార్జీలు చెల్లించి, వికారాబాద్ జిల్లాతోపాటు హైదరాబాద్నగరంలోని దవాఖానలకు వెళ్లేందుకు తమ వాహనం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పూడూర్పీఏసీఎస్ చైర్మన్ సంతోష్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
