తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి ఫ్రీగా రక్తం సరఫరా

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి ఫ్రీగా రక్తం సరఫరా

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రజా సేవలో ఎప్పుడూ ముందుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి  సహాయం చేయడానికి అస్సలు వెనుకాడరు. అందులో భాగంగా ఆయన నెలకొల్పినవే చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్స్(Chiranjeevi Charitable Trust). ఈ ట్రస్ట్ ద్వారా ఎన్ని సేవ కార్యక్రమాలు చేపట్టారు చిరంజీవి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఇటీవల ఆక్సీజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు.  

ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే లక్షల యూనిట్ల రక్తాన్ని ఉచితంగా అందించారు. అందులో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఉస్మానియా హైదరాబాద్ ఆసుపత్రికి 100 యూనిట్స్, నీలోఫర్ ఆసుపత్రికి 100 యూనిట్లు, గాంధీ ఆసుపత్రికి 100 యూనిట్స్, వరంగల్ హాస్పటల్స్ కు 100 యూనిట్స్, మహబూబ్ నగర్ హాస్పిటల్స్ కు 100 యూనిట్స్ రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి పంపించారు. ఈ కార్యక్రమాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

Also Read :- మూడునెలల తరువాత కొణిదెల వారింటికి క్లిన్ కార.. వేద మంత్రాలతో ఆహ్వానం

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి గారి అభిమానులు చేసే ఈ రక్తదానం ఎంతో మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని, ఇంతటి బృహత్తర కార్యానికి అండగా నిలిచిన చిరంజీవి గారి అభిమానులను, రక్తదాతలను ప్రశంసించారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ మరోసారి చిరంజీవిని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు .