మూడునెలల తరువాత కొణిదెల వారింటికి క్లిన్ కార.. వేద మంత్రాలతో ఆహ్వానం

మూడునెలల తరువాత కొణిదెల వారింటికి క్లిన్ కార.. వేద మంత్రాలతో ఆహ్వానం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) ఉపాసన(Upasana) దంపతులు ఇటీవలే తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఉపాసన 2023 జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఆ పాపకు క్లిన్ కార(Klin kaara) అని నామకరణం చేశారు. ఆ పేరును లలితా సహస్రనామం నుండి తీసుకున్నారని మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) అధికారికంగా ప్రకటించారు. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం.. బిడ్డకు జన్మనిచ్చాక తల్లి తన పుట్టింట్లోనే ఉండాలి. కనీసం మూడు నెలలు పుట్టింట్లో గడిపాకే .. అత్తింటికి వెళ్లాల్సి ఉంటుంది. ఉపాసన కూడా ఈ సంప్రదాయం ప్రకారం.. తన తల్లితండ్రుల ఇంట్లోనే ఈ మూడు నెలలపాటు ఉన్నారు. 

ALSO READ: హరిహర వీరమల్లు తో అద్భుతాన్ని చూస్తారు..ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

ఇక ఇప్పుడు ఆ మూడు నెలలు కాలం పూర్తవడంతో.. క్లిన్ కారతో  కొణిదెల నివాసం అయిన చిరంజీవి ఇంటికి వచ్చారు ఉపాసన. తమ  వారసురాలు మొదటి సారి తన ఇంట్లో అడుగుపెడుతుండటంతో.. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి చెందిన వేదపాఠశాల విద్యార్థులు వేదం మంత్రాల మధ్య క్లిన్ కారను ఇంట్లోకి అహ్వానించారు. అదే రోజు వినాయక చవితి కూడా కావడంతో.. అదే సమయంలో వినాయక విగ్రహాన్ని కూడా కొణిదెల నివాసంలోకి తీసుకువచ్చారు. ఈ ఆనంద క్షణాన్ని రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను!? ఈ సారి ప్రత్యేకత … చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం.. అంటూ ఫోటోస్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.