5 ఎకరాలలోపు ఉంటే ఉచిత బోరు.. గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం

5 ఎకరాలలోపు ఉంటే ఉచిత బోరు.. గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం

రైతన్నలకు జగనన్న మరో వరం

అర్హులైన రైతులకు ఉచితంగా బోర్లు

మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం..

అయిదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా బోరు వేయిస్తామని ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఈ ఉచిత బోర్లు వేయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన విధివిధానాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

చిన్న, సన్నకారు రైతులు.. వచ్చిన డబ్బునంతా బోర్లు వేయించడానికే ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వం భావించింది. అందుకే అలాంటి చిన్న రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హత గల రైతులు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తుకు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకాల జీరాక్స్ లను జతచేయాలని తెలిపింది. అర్హత గల రైతులందరికీ ఉచితంగా బోర్లు వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

For More News..

వీడియో: కారుతో గుద్ది.. మీది నుంచి ఎక్కించిన పోలీస్ ఆఫీసర్

వాటర్ ట్యాంకర్ లో కాళ్లు కడుకున్న డ్రైవర్.. వీడియో వైరల్

సినిమాలు లేక కిరాణ కొట్టు పెట్టుకున్న దర్శకుడు