నిమ్స్​లో ఉచితంగా గుండె ఆపరేషన్లు

నిమ్స్​లో ఉచితంగా గుండె ఆపరేషన్లు

పంజాగుట్ట, వెలుగు: నిజాం ఇనిస్టిట్ట్యూట్​ఆఫ్​మెడికల్​ సైన్సెస్​(నిమ్స్​) ఆసుపత్రిలో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి డైరెక్టర్​ ఎన్​.బీరప్ప శనివారం తెలిపారు. చార్లీస్​ హార్ట్​ హీరోస్  పేరుతో నిర్వహిస్తున్న ఆపరేషన్లు కోసం 24వ తేదీ ఆదివారం నుంచి 30 వ తేదీ వరకు మిలీనియం బ్లాకులో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

శిశువుల నుంచి  ఐదేండ్లలోపు పిల్లలకు గుండెలో రంధ్రం, గుండె సంబంధ వ్యాధులకు చికిత్స అందిస్తారు. బ్రిటన్​ వైద్యుడు రమణ దున్నపునేని ఆధ్వర్యంలో పదిమంది వైద్య బృందంతోపాటు నిమ్స్​ కార్డియాథోరాసిక్​ విభాగాధిపతి అమరేశ్వరరావు,  నీలోఫర్​ ఆసుపత్రి వైద్యులు పాల్గొంటున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు 040–23489025 నంబరు ద్వారా ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సంప్రదించవచ్చు.