
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్46లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గురువారం ఉదయం 10 గంటల నుంచి వివిధ విద్యార్హతలు కలిగిన నిరుద్యోగుల కోసం ఉచిత జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు.
రిటైల్ మార్కెటింగ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం ఆర్ఏఏఎస్సీఐ స్టైపెండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ మేళా జరుగుతుందన్నారు. 27 ఏండ్లలోపు వయస్సు కలిగిన బీఏ, బీఎస్సీ, బీకాం లేదా సమాన ఉత్తీర్ణత ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.