SBI బ్యాంకులో దొంగలు పడ్డారు.. 59 కేజీల బంగారం, 8 కోట్ల డబ్బు మాయం !

SBI బ్యాంకులో దొంగలు పడ్డారు.. 59 కేజీల బంగారం, 8 కోట్ల డబ్బు మాయం !

బెంగళూరు: ఇంట్లో దొంగలు పడి దోచుకెళతారనే భయంతో సొమ్ము భద్రంగా ఉంటుందని భావించి బంగారం, డబ్బును బ్యాంకుల్లో పెడుతుంటాం. కానీ.. ఆ బ్యాంకులో కూడా దొంగలు పడి దోచుకెళితే పరిస్థితి ఏంటి..? కర్ణాటకలోని విజయపురలో అదే జరిగింది. సొమ్ము పోయిందని తెలిసి విజయపుర ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్కి బాధితులు లబోదిబోమంటూ చేరుకున్నారు. తమ డబ్బు, బంగారం ఎక్కడని సిబ్బందిని నిలదీశారు. ఈ ఘటన ఏంటంటే.. ఎస్బీఐ బ్యాంకులో దొంగలుపడ్డారు. భారీ మొత్తంలో డబ్బు, బంగారంతో ఉడాయించారు. కర్ణాటకలోని విజయపుర SBI బ్యాంకు బ్రాంచ్లో ఈ భారీ దోపిడి జరిగింది. మంగళవారం సాయంత్రం ఈ లూటీ జరిగినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుల కోసం ఇప్పటికే ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఈ బ్యాంకు దోపిడికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం సాయంత్రం మాస్కులు ధరించిన ఒక గ్యాంగ్ కర్ణాటకలోని విజయపుర SBI బ్యాంకును టార్గెట్ చేసింది. మొత్తం ఐదుగురు దుండగులు బ్యాంకులోకి వెళ్లారు. డోర్లు క్లోజ్ చేశారు. నాటు తుపాకులతో బెదిరించి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్తో సహా క్యాషియర్, సిబ్బంది.. ఇలా మొత్తాన్ని తాళ్లతో కట్టేశారు. కాల్చేస్తామని బెదిరించి బంగారం, డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకుని డబ్బు, బంగారం చోరీ చేశారు. సాయంత్రం సమయం కావడంతో బ్యాంకులో కస్టమర్లు కూడా పెద్దగా లేరు. అప్పటికి లోపల ఉన్న కస్టమర్లను తుపాకులతో బెదిరించి సైలెంట్ చేసేశారు.

బ్యాంకులోకి వెళ్లీవెళ్లగానే అందరి దగ్గర ఫోన్లను లాగేసుకున్నారు. దీంతో.. పోలీసులకు వెంటనే సమాచారం తెలియలేదు. 50 కేజీల బంగారం, 8 కోట్ల డబ్బు దోచుకుని ఈ లూటీ గ్యాంగ్ బ్యాంకు నుంచి ఎస్కేప్ అయింది. ఈ విషయం తెలియగానే.. ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి స్పాట్కు చేరుకున్నారు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలిసి.. స్థానికులు భారీగా బ్యాంకు దగ్గరకు చేరుకోవడంతో బ్యాంకు దగ్గర రచ్చ రచ్చయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విజయపుర జిల్లాలోని చడ్చనా పట్టణంలోని SBI బ్యాంకులో ఈ ఘటన జరిగింది.