ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఐస్ క్రీమ్, హాంబర్గర్ పేర్లను నిషేధించారు. వాటికి ప్రత్యామ్నాయంగా కొరియన్ పేర్లను ఉపయోగించాలని ఆదేశించారు. సాంస్కృతిక నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
‘ఐస్‌క్రీమ్’ అనే పేరును ఉపయోగించడంతో ప్రజలపై విదేశీ ప్రభావం పడుతుందని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనుమానించారు. దీంతో దాని పేరును ఉత్తరకొరియా భాషలో ఎసుకిమో లేదా ఇయోరెంబోసెంగిగా పిలవాలని ఆదేశించారు.
ఈ పదాలకు ఐసు మిఠాయి అర్థం. హాంబర్గర్ పేరును కూడా కిమ్ మార్చారు. దీనిని డాజిన్- గోగి గియోపాంగ్ అని పిలవాలని కోరారు. పశ్చిమదేశాల పదాలను దేశ భాష నుంచి తొలగించడమే పదాల మార్పు వెనుక ఉన్న లక్ష్యమని డెయిలీ ఎన్కే పత్రిక వెల్లడించింది.
