34.81 కోట్ల మందికి మేలు
హైదరాబాద్, వెలుగు: జన్‌ధన్ ఖాతాదారులకు ఉచితంగా లైఫ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్‌ను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ ఖాతాదారులందరినీ సోషల్ సెక్యూరిటీ కిందకు తీసుకురావాలని ప్లాన్స్ వేస్తోంది. ప్రధాన్‌మంత్రి జీవన్ జ్యోతిబీమా యోజన, ప్రధాన్‌మంత్రి సురక్షా బీమా యోజన స్కీమ్‌లను అర్హులైన జన్‌ధన ఖాతాదారులకు అందించనుంది. ఆ తర్వాత మొత్తం 34.81 కోట్ల యాక్టివ్ జన్‌ధన్ ఖాతాలకు వర్తింపజేసే అవకాశాలుఉన్నాయి. పీఎం జీవన్‌జ్యోతి బీమా యోజన
కింద ఏడాదికి రూ. 330ప్రీమియంతో బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి రూ. 2లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. పీఎం సురక్షా బీమా యోజన కింద ఏడాదికి రూ.12 ప్రీమియంతో బ్యాంక్ అకౌంట్ ఉన్న 18–70 ఏళ్ల మధ్య వయసున్న వారికి రూ. 2 లక్షల యాక్సిడెంట్ కవర్‌ను ప్రొవైడ్ చేస్తోంది.
