కమలాపూర్​లో ఉచిత వైద్య శిబిరం

కమలాపూర్​లో ఉచిత వైద్య శిబిరం

కమలాపూర్, వెలుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ మొబైల్ మెడికేర్ యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం కమలాపూర్ లోని స్థానిక కమ్యూనిటీ హాల్లో వృద్ధులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా పాలకవర్గం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటిస్, సీనియర్ సిటిజన్స్, భారత ప్రభుత్వ సహకారంతో వృద్ధులకు సేవలందించేందుకు హనుమకొండ రెడ్ క్రాస్ వైద్యశాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. శిబిరం మాజీ ఎంపీటీసీ రమేశ్, రెడ్ క్రాస్ డాక్టర్లు  పాల్గొన్నారు.