కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సన్ షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మానేరు వాకర్స్అసోసియేషన్, శ్రీ వెంకటేశ్వర కాలనీ డెవలప్ మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో సిటీలోని సిద్ధార్థ హైస్కూల్ లో ఆదివారం ఫ్రీ మెడికల్క్యాంప్నిర్వహించినట్లు హాస్పిటల్ సీఈవో డాక్టర్తాటిపాముల సురేశ్‌కుమార్ తెలిపారు. ముందస్తు వైద్య పరీక్షలతో భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చని పేర్కొన్నారు.
మొత్తం 300 మందికి వైద్య పరీక్షలు చేసి, మందులు ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో సిద్దార్థ స్కూల్ ప్రిన్సిపాల్ ఆయేషా, మానేరు వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు భూపతి ఆనందం, అధ్యక్షుడు రేవోజు కనకాచారి, ప్రధాన కార్యదర్శి ముస్కుల విద్యాసాగర్ రెడ్డి, శ్రీవెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు గంగిడి దేవేందర్ రెడ్డి, డాక్టర్లు వినోద్ కుమార్, రాజేశ్, దీపక్ కస్తూరి, దివ్యారెడ్డి, శ్రీకాంత్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
