హుస్నాబాద్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం 

హుస్నాబాద్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం 

కోహెడ(హుస్నాబాద్) వెలుగు: జులై 1న డాక్టర్స్ డే సందర్భంగా హుస్నాబాద్ లో డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి ఆహ్వానించారు. 

అనంతరం మంత్రి పోస్టర్‌‌ను  ఆవిష్కరించారు.ఈ శిబిరంలో 15 మంది డాక్టర్లు వివిధ విభాగాలకు చెందిన సేవలను అందించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరాన్ని  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.