మేడారం జాతరలో 16 చోట్ల ఫ్రీ వైఫై సేవలు

మేడారం జాతరలో 16 చోట్ల ఫ్రీ వైఫై సేవలు

 గిరిజన సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే జాతరకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో సర్కారు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఫిబ్రవరి21 నుంచి 24వ తేదీ వరకు జరిగే జాతరకు కోటిన్నర వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు సోమవారం రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా మేడారం మహాజాతర రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ములుగు జిల్లా పోలీసులు రెడీ చేశారు. జాతర సమయంలో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మౌలిక వసతులు, నిర్వహణ కోసం ఈసారి రూ.105 కోట్లు కేటాయించింది. జాతర కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం గడిచిన పదేళ్లలో ఇదే తొలిసారి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆఫీసర్లు రూ.75 కోట్లతో అప్పటి ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపించారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముందుగా రూ.75 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత మంత్రులు సీతక్క, కొండా సురేఖ విజ్ఞప్తుల మేరకు అదనంగా మరో రూ.30 కోట్లు ఇచ్చారు. దీంతో రూ.70 కోట్లతో ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్స్, రూ.35 కోట్లతో నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్స్​ చేపట్టారు.

16 చోట్ల ఫ్రీ వైఫై సేవలు

మేడారం మహా జాతరలో బీఎస్ఎన్ఎల్ ఫ్రీ వైఫై సేవలు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 16 చోట్ల హాట్​స్పాట్లు ఏర్పాటు చేయనుంది. 15 నుంచి 25వ తేదీ దాకా సేవలు అందుబాటులో ఉంటాయి. 20 మంది సిబ్బందితో కూడిన మూడు బృందాలు వైఫై సెటప్ రెడీ చేస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ వరంగల్ జీఎం చంద్రమౌళి, డిప్యూటీ జీఎం విజయ్ భాస్కర్ రెడ్డి సోమవారం తెలిపారు. ప్రతిరోజు వన్ జీబీ డేటా ఫ్రీగా అందిస్తామన్నారు. 10 నుంచి 20 ఎంబీపీఎస్​ స్పీడ్​తో సేవలు అందుతాయని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ పేరుతో కనిపించే నెట్​వర్క్​ను కనెక్ట్ చేసుకుంటే వైఫై వస్తుందన్నారు. 

Also Read : మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం