
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో వాక్ స్వేచ్ఛ దుర్వినియోగం ఎక్కువైందని దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్టు మండిపడింది. తబ్లిగీ మర్కజ్, నిజాముద్దీన్ మర్కజ్ ఘటనపై నకిలీ వార్తలు వ్యాప్తి చేసినందుకు పలు టీవీ చానళ్లపై చర్యలు తీసుకోవాలంటూ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం పైవిధంగా స్పందించింది. మర్కజ్ ఘటన గురించి తాను ఏమనుకుంటున్నారో సెక్రటరీ చెప్పాలని, దీనిపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సీజేఐ బాబ్డే పేర్కొన్నారు. ముస్లిం కమ్యూనిటీని కించపరిచేలా మీడియా రిపోర్టింగ్ చేసిందంటూ జామియా ఉలామా ఏ హింద్, పీస్ పార్టీ, డీజే హల్లీ ఫెడరేషన్ ఆఫ్ మస్జిద్ మదారిస్, వక్ఫ్ ఇన్‌స్టిట్యూట్, అబ్దుల్ కుద్దుస్ లస్కర్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి.