
ఫ్రెంచ్ ఆటో కంపెనీ రెనాల్ట్కొత్త కైగర్ఎస్యూవీని ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్‌లో 1.0 లీటర్ టర్బో, 1.0 లీటర్ నాన్ టర్బో ఇంజన్లు ఉన్నాయి. ఇందులో 205 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 20.32 సెం.మీ డిస్ప్లే టచ్‌స్క్రీన్, 3 డ్రైవింగ్ మోడ్స్ (ఎకో, నార్మల్, స్పోర్ట్) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 21 సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.
వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ చార్జర్, మల్టీ వ్యూ కెమెరా వంటి అధునాతన ఫీచర్లను అందించారు. కొత్త రెనాల్ట్ కైగర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.29 లక్షల నుంచి మొదలవుతుంది. టర్బో మోడల్ టాప్ వేరియంట్ ధర రూ. 11.29 లక్షల వరకు ఉంటుంది. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.