పారిస్ : పోలెండ్ స్టార్ ప్లేయర్, వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వైటెక్.. అంచనాలను అందుకుంటూ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికా యంగ్‌స్టర్ కొకో గాఫ్ తొలిసారి ఫైనల్ చేరి స్వైటెక్‌తో టైటిల్ ఫైట్‌కు రెడీ అయ్యింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ స్వైటెక్ 6–2, 6–1తో డారియా కసాట్కినా (రష్యా)పై గెలిచింది. దీంతో వరుసగా 34వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా సెరెనా విలియమ్స్ పేరిట ఉన్న సెకండ్ లాంగెస్ట్ విన్నింగ్ రికార్డును సమం చేసింది. ఇక టైటిల్ ఫైట్‌లోనూ స్వైటెక్ గెలిస్తే.. 2000లో వీనస్ నెలకొల్పిన 35 వరుస విజయాల రికార్డును అందుకుంటుంది. ఇప్పటివరకు ఆడిన 56 సెట్లలో పోలెండ్ ప్లేయర్ 54 సెట్లు నెగ్గడం మరో విశేషం. మరో సెమీస్ మ్యాచ్‌లో 18 ఏళ్ల కొకో గాఫ్ (అమెరికా) 6–3, 6–1తో ట్రెవిసాన్ (ఇటలీ)పై గెలిచింది. దాంతో, 2004లో వింబుల్డన్ గెలిచిన మరియా షరపోవా తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచింది. శనివారం స్వైటెక్, గాఫ్ మధ్య ఫైనల్ జరుగుతుంది.
ఇగా హవా : -
64 నిమిషాల మ్యాచ్‌లో ఇగా స్వైటెక్‌కు ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. రెండో గేమ్‌లో నాలుగో బ్రేక్ పాయింట్‌ను కాచుకున్న స్వైటెక్ 2–0 లీడ్‌తో ముందంజ వేసింది. కసాట్కినా 2–2తో స్కోరు సమం చేసినా.. 6,8వ గేమ్స్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్వైటెక్ ఈజీగా తొలిసెట్‌ను చేజిక్కించుకుంది. ఇక, రెండో సెట్లోనూ ఆమె హవానే నడిచింది. నాలుగో గేమ్‌లో కసాట్కినా సర్వ్‌ను బ్రేక్ చేసిన వరల్డ్ నంబర్ వన్ 3–1 లీడ్‌లోకి వచ్చింది. వెంటనే తన సర్వీస్‌లను కాపాడుకోవడంతో పాటు ఆరో గేమ్‌లోనూ రష్యన్ ప్లేయర్‌ను నిలువరించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
రుబ్లెవ్‌కు సిలిచ్ షాక్ : -
మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఏడోసీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)కు షాక్ తగిలింది. 20వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 5–7, 6–3, 6–4, 3–6, 7–6 (10/2)తో రుబ్లెవ్‌పై గెలిచి సెమీస్‌లోకి వెళ్లాడు. 4 గంటలా 10 నిమిషాల మ్యాచ్‌లో సిలిచ్ 30 ఏస్‌లతో హడలెత్తించాడు. మరో మ్యాచ్‌లో రుడ్ (నార్వే)6–1, 4–6, 7–6 (7/2), 6–3తో రునె (డెన్మార్క్)పై నెగ్గి సెమీస్ చేరాడు.
బోపన్న జోడీ ఔట్ :-
ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇండియా డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న‑మెట్వె మిడిల్కూప్ (నెదర్లాండ్స్) పోరాటం ముగిసింది. సెమీస్‌లో బోపన్న‑మెట్వె 6‑3, 3‑6, 6‑7 (8/10)తో అరెవాలో (సాల్వెడార్) ‑రోజెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడింది.
మరిన్నివ ార్తల కోసం : -
హాకీ ఆసియాకప్ లో భారత్ కు కాంస్యపతకం
ఇక దాదా నయా జర్నీ

