French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ డ్రా రిలీజ్: టైటిల్ ఫేవరేట్‌గా అల్కరాజ్.. ఒకే డ్రా లో సిన్నర్, జొకోవిచ్

French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ డ్రా రిలీజ్: టైటిల్ ఫేవరేట్‌గా అల్కరాజ్.. ఒకే డ్రా లో సిన్నర్, జొకోవిచ్

టెన్నిస్ ప్రేమికులు ఎదురు చూస్తున్న 2025 ఫ్రెంచ్ ఓపెన్ ఆదివారం (మే 25) ప్రారంభం కానుంది. మే 25 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ జూన్ 8 న ఫైనల్ తో ముగిస్తుంది. రోలాండ్ గారోస్‌లో జరగబోయే ఈ టోర్నీ డ్రా గురువారం (మే 22) విడుదల చేశారు. జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్, నోవాక్ జొకోవిచ్ ఎప్పటిలాగే టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న జాక్ డ్రేపర్ టాప్ ఆటగాళ్లకు షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.

సిన్నర్, జొకోవిచ్ ఒకే డ్రా లో ఉండగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆల్కరాజ్ కు సెమీ ఫైనల్ వరకు ఈజీ డ్రా ఎదురైంది.అల్కరాజ్ నాలుగో రౌండ్‌లో బిగ్-సర్వింగ్ లెఫ్టీ బెన్ షెల్టన్‌తో తలపడే అవకాశం ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లో రెండు సార్లు ఫైనలిస్ట్‌ కాస్పర్ రూడ్‌ ఎదురయ్యే అవకాశం ఉంది. జపాన్‌ స్టార్ ప్లేయర్ కు చెందిన కీ నిషికోరితో అల్కరాజ్ తొలి రౌండ్ స్టార్ట్ చేస్తాడు. ప్రపంచ నంబర్ 1 జానిక్ సిన్నర్ తన టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఫ్రెంచ్ ఆటగాడు ఆర్థర్ రిండర్‌క్నెచ్‌తో తలపడనున్నాడు.

జొకోవిచ్ తన తొలి రౌండ్ లో  అమెరికాకు చెందిన మెకెంజీ మెక్‌డొనాల్డ్‌తో ఫ్రెంచ్ ఓపెన్ జర్నీ ప్రారంభిస్తాడు. ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే జొకోవిచ్ 25 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్ గా రికార్డ్ సృష్టిస్తాడు. గత ఏడాది రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మూడుసార్లు ఛాంపియన్ నోవాక్ జొకోవిచ్ తో క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడే అవకాశం ఉంది. సిన్నర్ ఐదో సీడ్ డ్రాపర్ తో.. ఎనిమిదో సీడ్ ఇటాలియన్ లోరెంజో ముసెట్టి, నాలుగో సీడ్ అమెరికన్ టేలర్ ఫ్రిట్జ్ తో క్వార్టర్ ఫైనల్స్‌ సమరం జరిగే ఛాన్స్ ఉంది.