ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి అడుగుపెట్టిన అల్కరాజ్‌‌‌‌

 ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి అడుగుపెట్టిన  అల్కరాజ్‌‌‌‌

పారిస్‌‌‌‌: స్పెయిన్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌.. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో రెండోసీడ్ అల్కరాజ్‌‌‌‌ 7–6 (10/8), 6–3,4–6, 6–4తో బెన్‌‌‌‌ షెల్టన్‌‌‌‌ (అమెరికా)పై గెలిచాడు. 3 గంటల 19 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌ మూడో సెట్‌‌‌‌ను చేజార్చుకున్నాడు. అయితే బలమైన సర్వీస్‌‌‌‌లు, బేస్‌‌‌‌ లైన్‌‌‌‌ గేమ్‌‌‌‌తో తొందరగానే పుంజుకున్నాడు. మ్యాచ్‌‌‌‌ మొత్తంలో 5 ఏస్‌‌‌‌లు, రెండు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసిన అల్కరాజ్‌‌‌‌ తన సర్వీస్‌‌‌‌లో 70 శాతం పాయింట్లు రాబట్టాడు.

 ఏడు బ్రేక్‌‌‌‌ పాయింట్లలో మూడింటిని సద్వినియోగం చేసుకున్నాడు. 43 విన్నర్లతో 140 పాయింట్లు నెగ్గాడు. 6 ఏస్‌‌‌‌లు, మూడు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసిన షెల్టన్‌‌‌‌ రెండు బ్రేక్‌‌‌‌ పాయింట్లను మాత్రమే కాచుకున్నాడు. 32 విన్నర్లు కొట్టిన అతను 47 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌తో మూల్యం చెల్లించుకున్నాడు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో   టొమ్మి పాల్‌‌‌‌ (అమెరికా) 6-–3, 6–--3, 6–-3తో పాపిరిన్‌‌‌‌ (ఆస్ట్రేలియా)పై, జొకోవిచ్‌‌‌‌ (సెర్బియా) 6-–3, 6–-4, 6–-2తో ఫిలిప్‌‌‌‌ మిసోలిక్‌‌‌‌(ఆస్ట్రియా)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌లోకి అడుగుపెట్టారు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో సబలెంక (బెలారస్‌‌‌‌) 7–5, 6–3తో అన్సిమోవా (అమెరికాపై, స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌) 4–6, 7–6 (8/6), 6–1తో పౌలిని (ఇటలీ)పై నెగ్గింది. ఆ క్రమంలో మూడు మ్యాచ్‌‌‌‌ పాయింట్లు కాచుకుని క్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశించింది. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో ఐదోసీడ్‌‌‌‌ స్వైటెక్‌‌‌‌ (పోలెండ్‌‌‌‌) 1–6, 6–3, 7–5తో రిబకినా (కజకిస్తాన్‌‌‌‌)పై, జెంగ్‌‌‌‌ (చైనా) 7–6 (7/5), 1–6, 6–3తో సమ్సనోవా (రష్యా)పై నెగ్గారు. 

బోపన్న, యూకీ జంటల ఓటమి

మరోవైపు ఈ టోర్నీలో ఇండియన్‌‌‌‌ ప్లేయర్ల పోరాటం ముగిసింది. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో వెటరన్‌‌‌‌ స్టార్‌‌‌‌ రోహన్‌‌‌‌ బోపన్న–ఆడమ్‌‌‌‌ పావ్లాసెక్‌‌‌‌ (చెక్‌‌‌‌) 2–6, 6–7 (5/7)తో రెండోసీడ్‌‌‌‌ హ్యారీ హిలియోవారా (ఫిన్లాండ్‌‌‌‌)–హెన్రీ ప్యాటెన్‌‌‌‌ (బ్రిటన్‌‌‌‌) చేతిలో ఓడారు. యూకీ భాంబ్రీ–రాబర్ట్‌‌‌‌ గాల్లోవే (అమెరికా) 4–6, 4–6తో తొమ్మిదో సీడ్‌‌‌‌ క్రిస్టియన్‌‌‌‌ హారిసన్‌‌‌‌–ఇవాన్‌‌‌‌ కింగ్‌‌‌‌ (అమెరికా) చేతిలో కంగుతిన్నారు.