వైరల్ వీడియో:దేశాధ్యక్షుడి చెంప ఛెళ్లుమంది

వైరల్ వీడియో:దేశాధ్యక్షుడి చెంప ఛెళ్లుమంది
  • అభిమానులని దగ్గరగా వెళ్లి పలుకరిస్తే చెంప ఛెళ్లు మనిపించిన యువకుడు

పారిస్: ఫ్రాన్స్‌ దేశాధ్యక్షుడు ఎమాన్యుయెల్ మార్కోన్‌ చెంప పగిలింది. ఆగ్నేయ ఫ్రాన్స్ లోని వాలెన్స్ అనే చిన్న పట్టణంలో ఆయన మంగళవారం పర్యటిస్తుండగా ఊహించని రీతిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
వాలెన్స్‌ సిటీని సందర్శిస్తున్న దేశ అధ్యక్షుడు తైన్‌ హెర్మిటేజ్‌ హోటల్‌లో బస చేశారు. హోటల్ నుంచి  బయటకు రాగా అభిమానులు, కార్యకర్తలు వచ్చి వేచి చూస్తుండడంతో వారి దూసుకుని రాకుండా అడ్డుగా పెట్టిన బ్యారికేడ్లను చూసి తన కోసం వచ్చిన అభిమానులను కలిసేందుకు దగ్గరగా వచ్చారు. చాలా దగ్గరగా వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా ఒక యువకుడు అకస్మాత్తుగా అధ్యక్షుని చెంపపై గట్టిగా కొట్టాడు. భద్రతా బలగాలు వెంటనే ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జరిగిన ఘటన లైవ్ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా జరిగిన దాడిని ధృవీకరించింది. ఇలాంటి భౌతిక హింసను సహించేది లేదని ప్రధాని జీన్‌ కాస్టెక్స్‌ ప్రకటించారు.