టీఎంసీకి మరో షాక్..రెబల్ గ్రూపులో చేరిన మదన్ మిత్ర

టీఎంసీకి మరో షాక్..రెబల్ గ్రూపులో చేరిన మదన్ మిత్ర

కోల్‌‌‌‌‌‌‌‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు మరో షాక్​తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు మదన్ మిత్ర బుధవారం పార్టీకి రాజీనామా చేసి, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్ గ్రూపులో చేరారు. మదన్ మిత్రను మమతా బెనర్జీ టీఎంసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన రెండు వారాలకే ఆయన రాజీనామా చేశారు. టీఎంసీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య తన పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 

ఈ సందర్భంగా మదన్ మిత్ర మీడియాతో మాట్లాడుతూ.. టీఎంసీ ఒక విచ్ఛిన్నమైన పార్టీగా మారిందని అన్నారు. అయితే, తాను కేవలం గదిని మాత్రమే మార్చానని.. ఇంటిని కాదని.. తాను పూర్తిగా టీఎంసీలోనే ఉన్నానని తెలిపాడు. మే నెలలో జరిగిన బెంగాల్​అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.