Kitchen Tips : మీ ఇంట్లోని ఫ్రిజ్ ఇలా క్లీన్ చేసుకోండి

Kitchen Tips : మీ ఇంట్లోని ఫ్రిజ్ ఇలా క్లీన్ చేసుకోండి

ఫ్రిజ్ ని సరైన పద్ధతిలో వాడకపోతే కొన్ని రోజులకే అటకెక్కుతుంది. అలా కాకూడదంటే దాని మెయింటెనెన్స్, క్లీనింగ్ పై శ్రద్ధ పెట్టాలి. 

  • కొన్నిసార్లు ఫ్రిజ్  లో పెట్టిన కూరగాయలు, ఆకుకూరలు కుళ్లిపోయి ఫ్రిజ్ అంతా వాసన వస్తుంది. అది పోవాలంటే ఫ్రిజ్ లో అక్కడక్కడ నిమ్మ చెక్కలు పెట్టాలి.
  • ఫ్రిజ్ వాసన రాకూడదంటే చిన్న కప్పులో వంట సోడా తీసుకుని ఫ్రిజ్ లో ఓ మూల పెట్టాలి. ఒక గిన్నెలో పావువంతు నీళ్లు తీసుకుని రెండు టీస్పూన్ల వంటసోడా కలపాలి. ఆ నీళ్లలో స్పాంజి ముంచి ఫ్రిజ్ తుడిస్తే మెరుస్తుంది.
  • స్ప్రే బాటిల్ లో ఒక కప్పు నీళ్లు, ఒకటీ స్పూన్ వెనిగర్ వేయాలి. ఆ లిక్విడ్ ను బాగా కలిపి ఫ్రిజ్ లో స్ప్రే చేస్తే శుభ్రమవుతుంది.
  • సింగిల్ డోర్ ఫ్రిజ్లలో ఐస్ గడ్డకడుతుంటుంది. అలాంటప్పుడు కత్తితో డీప్ ఫ్రీజ్ లో ఐస్ తీయకూడదు. అలా చేస్తే ఫ్రీజర్ లో ఉండే పైపు పగిలిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల గ్యాస్ లీక్ అవుతుంది.
  • ఫ్రిజ్ ఆన్ లో ఉన్నప్పుడు అటూ ఇటూ కదపకూడదు.
  • అలాగే రెండుమూడు గంటలకు మించి కరెంట్ పోతే ఫ్రిజ్ తెరిచి పెట్టాలి. లేదంటే లోపలి ఫుడ్ పాడయ్యే అవకాశం ఉంటుంది.