డిసెంబర్ 17న నల్గొండలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

డిసెంబర్ 17న నల్గొండలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

నల్గొండ, వెలుగు:  క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకే ఈనెల 17న నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో  జీఎమ్మార్11, బీఎస్ఆర్ 11 టీమ్ ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించనున్నట్లు నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్  గౌడ్ తెలిపారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో కోమటిరెడ్డి ప్రతీక్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రీమియర్ లీగ్ -6 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఫ్రెండ్లీ మ్యాచ్ కు సంబంధించి శనివారం మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న నల్గొండ ప్రీమియర్ లీగ్ 6 క్రికెట్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభిస్తోందన్నారు.  టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరో మంత్రి, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజహారుద్దీన్ పాల్గొంటారని తెలిపారు. 

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మందడి శ్రీనివాసరెడ్డి,జూలకంటి శ్రీనివాస్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, బొజ్జ శంకర్, బుర్రి యాదయ్య, సమద్, ముషంపల్లి  ఉపసర్పంచ్ బీరం కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, గుమ్మల నాగిరెడ్డి, చింతపల్లి గోపాల్, పాదం అనిల్,యూత్ కాంగ్రెస్ నాయకులు మామిడి కార్తీక్, నాగరాజు, ఆనంద్ రెడ్డి, ఆర్గనైజర్స్ బోనగిరి ప్రభాకర్, పాలకూరి శ్రీధర్ పాల్గొన్నారు.