సత్యం రాజేష్ హీరోగా ఫ్రెండ్లీ ఘోస్ట్

సత్యం రాజేష్ హీరోగా ఫ్రెండ్లీ ఘోస్ట్

సత్యం రాజేష్, రియా సచ్‌‌‌‌దేవ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫ్రెండ్లీ ఘోస్ట్’. జి మధుసూధన్ రెడ్డి దర్శకత్వంలో  విశ్వనాథ్ డి.కె నిర్మిస్తున్నారు. సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను మంచు మనోజ్ విడుదల చేసి.. సినిమా విజయం సాధించాలని టీమ్‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, త్వరలోనే సాంగ్స్, టీజర్, ట్రైలర్‌‌‌‌‌‌‌‌ రాబోతున్నాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు.  

ఆడియెన్స్  తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉందని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, మధు నందన్, చమ్మక్ చంద్ర, థర్టీ ఇయర్స్ పృథ్వీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.