
రైన్ క్యోటో కాలిఫోరిన్యాలోని వెస్ట్ పార్క్ ఎలిమెంటరీ సూక్ల్ లో మూడో కాల్ స్ చదువుతుండు. వాళ్ల అమ్మ సింగిల్ పేరెంట్ . మిడిల్ క్లాస్స్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ ఇచ్చే పైసలను కిడ్డీ బ్యాంక్ లో పైలంగ దాచిపెట్టుకుంటడు రైన్ . అవసరం వచ్చినప్పుడు తీసి వాటిని ఖర్చు పెటేట్టోడు. అయితే, క్రిస్మస్ నుంచి దాచిపెట్టు కుంటున్న తన పైసలన్నీ తీసుకుపోయి… తన క్లాస్ మేట్స్ అందరి లంచ్ డెబిట్స్ (అప్పులు కట్టిండు. రైన్ డొనేషన్ ని అంగీకరించినట్లు ఆ స్కూల్ తెలిపింది. ఈలంచ్ డెబిట్స్ ఏంటివి అనుకుంటున్నారా? అమెరికాలో పిలల్లు లంచ్ బాక్స్ తీస్కపోరు. బడిలోనే అన్నం పెడ్తరు. అయితే, అది ఫ్రీగాగా కాదు పైసలు కట్టాలే! అన్నం అప్పుగా పెట్టిన తర్వాత క్రెడిట్ కార్డు లగా పైసలు వసూల్ చేసుకుంటరన్నమాట. ఆ అప్పు లిమిట్ దాటితే అన్నం పెట్టరు.
ఎందుకిట్ల చేసిండు?…..
ఒక రోజు పొద్దుగాల రైన్ టీవీ చూసుకుంట బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడు. ‘ ఒక చిన్నారి ఎకౌంట్ లో లంచ్ కి సరిపడా డబ్బుల్లేవని… ఇచ్చిన లంచ్ బాక్స్ గుంజుకున్నారు. ఈ ఘటన ఇండియానాలోని ఓ స్కూల్లో చోటుచేసుకుంది’ అనే మాటలు వినపడ్డాయి రైన్ కి. ‘అరె మా క్లాస్ లో కూడా ఇట్లాంటి పిలల్లు ఉన్నారు కదా?’ అని గుర్తుకొచ్చింది. వెంటనే వెళ్ళి అడిగితే.. తన క్లాస్ మేట్స్ మొత్తం 74.50 డాలర్ల లంచ్ డెబిట్స్ ఉన్నాయి. ఇంకేముంది తాను దాసుకున్న పైసలను తీస్కపోయి కట్టిండి. స్కూలుకు సంబంధించి కాలిఫోర్నియా డిస్ట్రిక్ పాలసీల పర్కారం.. లంచ్ ఫీజులు కట్టకున్నా.. లంచ్ పెట్టాలి. సంవత్సరం చివర్లో వాళ్ల పేరెంట్స్ నుంచి ఆ అప్పును వసూలు చేసుకోవాలి. కానీ, చాలా స్కూళ్లు పాలసీలను పాటించకుండా పిలల్లకు లంచ్ పెడ్తలేవు.
అందరి చూపు అతడిపైనే….
నిస్వార్ధంగా ఆ పిలగాడు చేసిన పని సెలబ్రిటీలు, పొలిటీషియన్ లను ఆకట్టుకుంది. డెమొక్రటిక్ పార్టీ సెనేటర్ సాండర్స్ ,మేయర్ బిల్ డే బ్లాసియో వంటి వాళుల్ అమెరికాలో పేదరికం గురించి చర్చించడం స్టార్టు చేసిండ్రు. ప్రపంచ చరిత్రలో ధనిక దేశంగా వెలుగుతున్న అమెరికాలో లంచ్ డెబిట్స్ ఉండకూడదు. మేం అధికారంలోకి వచినంక ప్రతీ స్కూళ్లో ఫ్రీగా లంచ్ పెడతాం.’ అని శాండర్స్ ట్వీట్ చేసిండు. ‘రైన్ నువువ్ చాలా గొప్ప పని చేసినవ్ .. ఎంతో దయ, కరుణ ఉంటే తప్ప ఇలాంటి పనులు చెయలేరు.’ అని సెలబ్రిటీలు పొగిడిన్రు..‘ ఒక సింగిల్ పేరెంట్ గా.. పైసల విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. ఏడాది చివర్లో వంద డాలర్లు( దాదాపు ఏడు వేల రూపాయలు) వస్తే కట్టడం నాకు చాలా కష్టం అయితది. కానీ, రైన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. వాడి వల్ల కొంత మంది దాతలు లంచ్ డెబిట్స్ కట్టడానికి టట్డానికి ముందుకొచ్చారు.. రైన్ నా కొడుకు అయినందుకు గర్వపడుతున్నా ’ అని చెప్పింది రైన్ తల్లి కిర్క్ పాట్రిక్. రైన్ పనిని ప్రేరరణగా తీసుకుని ‘చొబానీ’ అనే కంపెనీ అమెరికాలోని కొన్ని స్కూళ్లో 85వేల డాలర్ల లంచ్ డెబిట్స్ కట్టింది.