ఫ్రెండ్‌ షిప్ డేకి ఇంత హిస్టరీ ఉందా.. అసలు ఈ రోజునే ఎందుకు జరుపుకుంటారంటే ?

ఫ్రెండ్‌ షిప్ డేకి ఇంత హిస్టరీ  ఉందా.. అసలు ఈ రోజునే ఎందుకు జరుపుకుంటారంటే  ?

స్నేహితుల దినోత్సవం (friendship) అనేది రక్త సంబంధం కానీ బంధాలలో గొప్పది. ఇంకా వయస్సు, మతం, కులం అలాంటివి ఏవి లేకుండా ఫ్రెండ్స్ గా మారుస్తుంది. ఈ  బంధానికి గుర్తింపుగా భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవం జరుపుకుంటుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా స్నేహితుల దినోత్సవం 3 ఆగస్టు  2025న అంటే రేపే వస్తుంది.

స్నేహితుల దినోత్సవంకి ఉన్న  చరిత్ర: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను మొదట 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గుర్తించింది. అయితే ఈ ఆలోచన యునెస్కో  ప్రతిపాదన నుండి వచ్చింది. ఐక్యరాజ్యసమితి 1997లో ఈ విధానాన్ని స్వీకరించింది. భారతదేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకంటే, ఆరోజు సెలవు రోజు కాబట్టి స్నేహితులు  కలిసి హ్యాపీగా  గడపడానికి సమయం ఉంటుంది.

 స్నేహం అనేది ప్రపంచ దేశాలు, సంస్కృతులు, నమ్మకాల మధ్య ఉండే తేడాలను తొలగించవచ్చు. ఈ రోజుల్లో మనుషుల మధ్య ఏర్పడుతున్న పగలు, గొడవలు  స్నేహితుల దినోత్సవం  ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. 

►ALSO READ | శ్రావణమాసం 2025 : ఆదివారం ( ఆగస్టు3) ఈ పనులు అస్సలు చేయొద్దు.. కష్టాలు వెంటాడుతాయి..!

కష్టాల్లో సంతోషాల్లో మనకు తోడుగా ఉన్న స్నేహితులను గుర్తుచేసుకోవడం, కలవడానికి ఈ రోజు ఒక మంచి అవకాశం. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు కట్టుకోవడం, ఫ్రెండ్షిప్ డే మెసేజ్‌లు పంపడం వంటివి చేస్తూ ఈ రోజును సంతోషంగా జరుపుకుంటారు.

ఫ్రెండ్షిప్ డే  ఎలా జరుపుకోవాలి అంటే : స్నేహితుల దినోత్సవాన్ని పాత, కొత్త స్నేహితులకు మెసేజ్‌లు పంపడం, కలవడం లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా జరుపుకోవచ్చు.  
* మీ ఫ్రెండ్స్ కి ఒక మెసేజ్ పంపి విష్ చేయండి  లేదా కాల్ చేసి మాట్లాడండి. 
* ఫ్రెండ్స్ తో డిన్నర్ లేదా లంచ్ ప్లాన్ చేయండి లేదా వీడియో కాల్‌లో మాట్లాడుకోవడానికి ప్లాన్ చేసుకోండి.
* ఏదైన సమాజా సేవా, స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనండి.
* చేతితో తయారు చేసిన గ్రీటింగ్ కార్డులు, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు లేదా చిన్న గిఫ్ట్స్  ఇచ్చుకోండి. 

 

కొన్ని ఫ్రెండ్షిప్  కొటేషన్స్ మీకోసం 

మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఆనందంతో, నవ్వులతో, జ్ఞాపకాలతో మరింత బలంగా మారాలని కోరుకుంటున్నాను

నిజమైన ఫ్రెండ్స్ దూరంగా ఉండవచ్చు, కానీ మనసుకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 

నా కష్టాల్లో నవ్వుగా, నా విజయాలలో సంతోషంగా ఉన్నందుకు  థాంక్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 

ఫ్రెండ్స్ అనేది మనం సెలెక్ట్  చేసుకునే ఫ్యామిలి. థాంక్యూ నిన్ను నేను సెలెక్ట్ చేసుకున్నందుకు

ప్రపంచంలో ఉన్నవాళ్లు వదిలేసి వెళ్ళిపోయిన, నీతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు- Walter Winchell

ఇద్దరు వ్యక్తుల మధ్య మౌనం కూడా సౌకర్యంగా ఉన్నప్పుడే నిజమైన స్నేహం ఏర్పడుతుంది-David Tyson

నిన్ను నువ్వుగా ఉండనిచ్చే నిజమైన స్వేచ్ఛను ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు-Jim Morrison