రేప్‌ చేయడానికి ఫ్రెండ్‌షిప్ ఏమీ లైసెన్స్‌ కాదు.. పోక్సో కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు కామెంట్

రేప్‌ చేయడానికి ఫ్రెండ్‌షిప్ ఏమీ లైసెన్స్‌ కాదు.. పోక్సో కేసు విచారణలో  ఢిల్లీ హైకోర్టు కామెంట్

న్యూఢిల్లీ:  రేప్ చేయడానికి ఫ్రెండ్‌షిప్ ఏమీ లైసెన్స్ కాదని పోక్సో కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ బాలిక (17)ను పక్కింట్లో ఉండే వ్యక్తి తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లి బంధించి,  అత్యాచారానికి పాల్పడ్డాడు. బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. 

బాధితురాలు ధైర్యంతో పోలీసులను ఆశ్రయించగా పోక్సో కేసు నమోదైంది. తామిద్దరం ఫ్రెండ్స్ అని, ఇష్టపూర్వకంగానే రిలేషన్ లో ఉన్నామని, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, అత్యాచారం చేయడానికి,  బంధించేందుకు, కొట్టేందుకు స్నేహం ఎలాంటి లైసెన్స్ ఇవ్వదు’’ అని జడ్జి కామెంట్ చేశారు. నిందితుడి బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు.