ఫైర్‌‌క్రాకర్స్‌‌పై పలు రాష్ట్రాల్లో బ్యాన్.. అదే దారిలో మరికొన్ని స్టేట్స్!

ఫైర్‌‌క్రాకర్స్‌‌పై పలు రాష్ట్రాల్లో బ్యాన్.. అదే దారిలో మరికొన్ని స్టేట్స్!

న్యూఢిల్లీ: గాలి కాలుష్యం పెరుగుతుండటంతోపాటు కరోనా వ్యాప్తి దృష్ట్యా దీపావళి వేడుకలపై పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీపావళికి ఫైర్‌క్రాకర్స్‌‌ను కాల్చొద్దని రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కింతోపాటు ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఫైర్‌‌క్రాకర్స్‌‌ను బ్యాన్ చేశాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలు టపాసులను పూర్తిగా నిషేధించగా.. మరికొన్ని స్టేట్స్ ఇంపోర్టెడ్ క్రాకర్స్‌‌ను బ్యాన్ చేశాయి. ఈ స్టేట్స్ దారిలో నడవడానికి పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయని సమాచారం.

కరోనా పేషెంట్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తమ రాష్ట్రంలో ఫైర్‌క్రాకర్స్‌‌ను కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు ఒడిశాలో ఎవరైనా ఫైర్‌‌క్రాకర్స్‌‌ను అమ్మితే డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఏకే త్రిపాఠి హెచ్చరించారు. ఢిల్లీలో రికార్టు స్థాయిలో పొగ ఆవరించడంతో ఫైర్ క్రాకర్స్‌‌ వినియోగంపై ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ నిషేధం విధించారు. ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉంటూ లక్ష్మీ పూజ చేసుకుంటూ పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.