యూట్యూబర్​ : సరదా కోసం సిల్లీ పాయింట్​!

యూట్యూబర్​ : సరదా కోసం సిల్లీ పాయింట్​!

సాధారణంగా టీనేజ్​ పిల్లలు సమ్మర్​ హాలీడేస్​ రాగానే టూర్లు, లాంగ్​ ట్రిప్పులకు ప్లాన్​ వేస్తుంటారు. కానీ.. ఈ ఇద్దరు మాత్రం వాళ్ల ఇంటర్​ పరీక్షలు రాయగానే సరదాగా ఓ యూట్యూబ్​ చానెల్​ మొదలుపెట్టారు. అందులో ఐపీఎల్​ మీద వీడియోలు చేశారు. అలా సరదా కోసం మొదలుపెట్టిన చానెల్​కు ఇప్పుడు తొమ్మిదిన్నర లక్షలమంది సబ్​స్క్రయిబర్లు ఉన్నారు. దాని ద్వారా ఇద్దరూ ప్రతి నెలా లక్షల్లో సంపాదిస్తున్నారు. 

ఐపీఎల్ సీజన్​ మొదలైందంటే చాలు.. యువకుల్లో క్రికెట్​ మీద చర్చ మొదలైపోతుంది. ఏ టీం గెలుస్తుంది? ఎవరు బాగా ఆడుతున్నారు?..  ఇలాంటి విషయాల మీద గంటల తరబడి మాట్లాడుకుంటుంటారు. ముంబైకి చెందిన అభ్యుదయ మోహన్, గౌతమి కవాళే కూడా అలాంటివాళ్లే. మోహన్​ 1998 జనవరి 2న పుట్టాడు.  గౌతమి 1998 అక్టోబర్ 29న పుట్టింది. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కాలేజీలో మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు యూట్యూబ్​ గురించి చర్చకు వచ్చింది. దాంతో సరదాగా ఒక యూట్యూబ్​ చానెల్​ పెట్టాలని నిర్ణయించుకున్నారు. 

సిల్లీ పాయింట్​గా మొదలై.. 

మోహన్​, గౌతమి 2016లో ఇంటర్​ పరీక్షలు రాసిన వెంటనే సమ్మర్​ సెలవుల్లో ‘సిల్లీ పాయింట్​’ పేరుతో ఒక యూట్యూబ్​ చానెల్ పెట్టారు. ఇండియాలో ఎక్స్​క్లూజివ్​గా క్రికెట్​ మీద మాత్రమే కంటెంట్​ చేసే మొదటి చానెల్​ ఇది. గౌతమి క్రికెట్​కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు పేపర్​ మీద రాసుకుని జనాలు ఎక్కువగా ఉండే ప్లేస్​లకు వెళ్లేది. ర్యాండమ్​గా కొంతమందిని సెలక్ట్‌‌‌‌ చేసి, వాళ్ల ముందు మైక్​ పెట్టి ఆ ప్రశ్నలు అడిగేది.

ఆ వీడియోలను యూట్యూబ్​లో పోస్ట్‌‌‌‌ చేసేవాళ్లు. కానీ.. ఆ కంటెంట్​కు ఆశించిన స్థాయిలో రీచ్​ రాలేదు. దాంతో కామెడీ, సినిమా రివ్యూలు, సెటైరికల్​, అవేర్​నెస్​ వీడియోలు చేయాలని డిసైడ్​ అయ్యారు. అందుకే 2017లో చానెల్ పేరుని ‘స్లే పాయింట్​’గా మార్చారు.  ఆ తర్వాత కామెడీ వీడియోలు చేశారు. వాటికి మంచి రీచ్​ రావడమే కాకుండా చానెల్​కు సబ్​స్క్రయిబర్ల సంఖ్య కూడా పెరిగింది. తర్వాత కామెంట్ల ద్వారా వ్యూయర్స్​ ఇష్టాయిష్టాలను అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టు మిల్లెనియల్, జెన్-జెడ్​లను ఆకర్షించే కంటెంట్​ మీద దృష్టి పెట్టారు. 

బినోద్ మీమ్​తో పాపులర్​

చానెల్​లో 2019లో వాళ్లు ‘‘వై ఇండియన్​ కామెంట్స్​ సెక్షన్​ ఈజ్​ గార్బేజ్​ (బినోద్​)” పేరుతో ఒక వీడియో చేశారు. అందులో వాళ్ల వీడియోలకు బినోద్ థరూ అనే ఒక వ్యూయర్​ తన పేరు “బినోద్” అని మాత్రమే కామెంట్ చేయడం గురించి అభ్యుదయ, గౌతమి కామెడీగా మాట్లాడారు. వాళ్లు మాట్లాడే విధానం, కామెడీ టైమింగ్​ అందరికీ నచ్చింది. దాంతో ఆ వీడియో వైరల్​ అయ్యింది. అంతేకాదు.. ‘‘బినోద్​” పేరుతో చాలా మీమ్స్​ వచ్చాయి. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్స్​ “బినోద్” అనే పదం విపరీతంగా ట్రెండ్​ అయ్యింది. ఆ ఒక్క వీడియో వల్ల కొన్ని లక్షల మంది చానెల్​ని సబ్‌‌‌‌స్క్రయిబ్​ చేసుకున్నారు.

ఆ వీడియోకు 17 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. పైగా “బినోద్” మీమ్ ఇప్పటికీ ఇంటర్నెట్​లో షేర్​ అవుతోంది.  అంతేకాదు.. కొంతమంది వ్యూయర్స్​ హిందీలోని టాప్​ చానెల్స్​లో పెట్టే వీడియోలకు కూడా ‘బినోద్​’ అని కామెంట్​ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే నాసా లాంటి సంస్థల లైవ్​ స్ట్రీమ్‌‌‌‌లలో కూడా “బినోద్” అని కామెంట్లు పెట్టారు. దాంతో స్లే పాయింట్​ చానెల్​ గురించి అందరికీ తెలిసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని  “హూ క్రియేటెడ్​ ఈజ్​ బినోద్​?” అనే ఫాలో-అప్ వీడియో చేశారు. అందులో ఈ ట్రెండ్​కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు అభ్యుదయ, గౌతమి. 

స్లే పాయింట్​లో అప్​లోడ్​ చేసే కంటెంట్ ప్రధానంగా హిందీ, ఇంగ్లీష్‌‌‌‌లోనే ఉంటుంది. కానీ.. వాళ్ల కామెడీ, ఎంచుకునే అంశాల వల్ల తెలుగు వ్యూయర్స్​ని కూడా ఆకర్షించారు. ప్రస్తుతం వాళ్లు భారతీయ సంస్కృతి, బాలీవుడ్, డైలీ రొటీన్​ వ్లాగ్స్​ లాంటివి చేస్తున్నారు.

మరో రెండు చానెళ్లు

ప్రస్తుతం ‘స్లే పాయింట్​’ చానెల్​ను 9.47 మిలియన్ల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. ఇందులో పది మిలియన్లకు పైగా వ్యూస్​ వచ్చిన వీడియోలు చాలానే ఉన్నాయి. ఈ చానెల్‌‌‌‌లో కేవలం లాంగ్​ ఫార్మాట్​ వీడియోలు మాత్రమే అప్​లోడ్​ చేస్తున్నారు. షార్ట్ ఫార్మాట్​ వీడియోల కోసం ప్రత్యేకంగా ‘స్లే షార్ట్స్​’ పేరుతో మరో చానెల్​ నడుపుతున్నారు. అయితే.. ‘స్లే పాయింట్​’కి టైం పాస్​ వెర్షన్​గా 2017లో ‘సిల్లీ పాప్​’ అనే మరో చానెల్​ని కూడా క్రియేట్​ చేశారు. దీన్ని ఇప్పటివరకు 2.84 మిలియన్ల మంది సబ్‌‌‌‌స్క్రయిబ్​ చేసుకున్నారు. ఇందులో ప్రస్తుతం 117 వీడియోలు ఉన్నాయి.