అయోధ్య యాత్ర.. కారుపై రామాయణంలోని దృశ్యాలు.. వ్యాపారి కొత్త ఆలోచన

అయోధ్య యాత్ర.. కారుపై రామాయణంలోని దృశ్యాలు.. వ్యాపారి కొత్త ఆలోచన

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు దేశం సిద్ధమవుతున్న వేళ, సూరత్‌కు చెందిన సిద్ధార్థ్ దోషి అనే ఓ వస్త్ర వ్యాపారి.. ఈ అపూర్వమైన యాత్రకు శ్రీకారం చుట్టారు. అతని మోడ్రన్ కారు.. అత్యాధునిక జాగ్వార్ భక్తికి ప్రకాశవంతమైన చిహ్నంగా రూపాంతరం చెందింది. దేశభక్తి, మతపరమైన ఉత్సుకత ప్రదర్శనలకు పేరుగాంచిన దోషి, తనకిష్టమైన కారును ప్రకాశవంతమైన కాషాయం రంగులో తయారు చేయారు చేయించారు. రామాయణం, రాముడి ఇతిహాస కథలోని దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన కుడ్యచిత్రాలను కారుపై చిత్రించాడు.  

అతను గతంలో G-20 శిఖరాగ్ర సమావేశం, చంద్రయాన్ మిషన్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా తన జాగ్వార్‌ను కొత్తగా తయారుచేశారు. ఇప్పుడు రామాలయ ప్రతిష్ఠాపన ఆయనకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్టు తెలియజేశాడు. ఇది భారతదేశానికి ఒక చారిత్రాత్మక క్షణమని, ఇతరులలో ఆనందాన్ని కలిగించే విధంగా తాను ఈ క్షణాలను జరుపుకోవాలని కోరుకుంటున్నానని దోషి చెప్పాడు.

సూరత్ నుండి అయోధ్య వరకు దోషి ప్రయాణం కేవలం సుందరమైన డ్రైవ్ మాత్రమే కాదు. 1,400 కిలోమీటర్ల మార్గంలో గ్రామాలు, దేవాలయాలను సందర్శించి, ప్రజలు, దైవం నుండి ఆశీర్వాదం పొందాలని కూడా ఆయన యోచిస్తున్నారు. తాను ఈ అనుభవాన్ని ప్రజలతో పంచుకోవాలని, వారితో జరుపుకోవాలనుకుంటున్నానని ఆయన వివరించారు.