సీజన్ తో సంబంధం లేకుండా సఎప్పుడైనా దొరికే ఆరెంజ్ ఫ్రూట్స్ తో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే. దీనికి 'ఫ్రూట్స్ ఆఫ్ ద గాడ్స్' అని, 'గోల్డెన్ యాపిల్' అనే పేర్లు కూడా ఉన్నాయి. దీన్ని నేరుగా తినడంతోపాటు జ్యూస్, జామ్స్, పికిల్స్, క్యాస్ట్ ఫుడ్.. ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు. విటమిన్-సి, థయామిన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో న్యూట్రియెంట్స్ ఉన్నాయి ఆరెంజ్ ఫ్రూట్స్ లో.
ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి వీటిని రోజూ తీసుకుంటే గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఎముకలు బలంగా మారతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది. అన్నింటికీ మించి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. చాలాకాలం నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నవాళ్లు, ఆరెంజ్ ఫ్రూట్ స్ ఎక్కువగా తినాలి.
రోజూ జ్యూస్ చేసుకుని తాగినా మంచిదే. తాజా పండ్లు తినడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మార్కెట్లో దొరికే ప్యాకేజ్డ్ డ్రింక్లతో ఇంతటి ప్రయోజనం ఉండదు. అయితే అల్సర్ వంటి సమస్యలున్నవాళ్లు డాక్టర్ సలహాతో ఈ ఫ్రూట్స్ తీసుకోవాలి.
