స్వల్పంగా తగ్గిన పెట్రోల్ రేటు

స్వల్పంగా తగ్గిన పెట్రోల్ రేటు

పెట్రో బాదుడుకు చిన్న బ్రేక్ వచ్చింది. గడిచిన మూడు రోజులుగా ఎటువంటి పెరుగుదల లేకుండా స్టేబుల్‌గా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం ఒక్కింత కిందికి వచ్చాయి. రెండింటిపైనా లీటరుకు 15 పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ స్వల్ప తగ్గింపుతో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ.105.26కు, డీజిల్ రేటు రూ.96.69కి తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 15 పైసల తగ్గింపుతో పెట్రోల్ రూ.101.19, డీజిల్‌ రూ.88.62కు చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం పెట్రోల్‌పై 13 పైసలు మాత్రమే తగ్గింది. దీంతో అక్కడ పెట్రోల్ రేటు రూ.107.26గా ఉంది. ముంబైలో డీజిల్‌పై 14 పైసలు తగ్గడంతో లీటర్‌‌ రేటు రూ.96.19కి చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌‌కు 12 పైసల చొప్పున మాత్రమే తగ్గి‌ పెట్రోల్ రూ.93.96కు, డీజిల్ రేటు రూ.93.26కు చేరాయి.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పెట్రోల్ రేటు రూ.101.72కు, డీజిల్ రేటు రూ.91.71కి తగ్గింది. సెప్టెంబర్ 5న తాజా తగ్గింపుతో కర్ణాటక రాజధాని బెంగళూరులో పెట్రోల్ లీటర్ రేటు రూ.104.70, డీజిల్ రేటు రూ.94.04గా ఉన్నాయి.